KRNL: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 101వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, అశోకానంద రెడ్డి, రఘురామయ్య, కృష్ణమూర్తి, కమతం వెంకటేష్ దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని JAC నాయకులు డిమాండ్ చేశారు.
AP: అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. ఆకతాయిలను గుర్తించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. రజియా హుసేన్ పేరుతో జిల్లాలోని అన్ని కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని కోర్టుల వద్దకు డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి సోదాలు చేస్తున్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చిపల్లి కాయ ధర రూ.5,500, క్వింటాల్ సూక పల్లికాయ ధర రూ.9,300, క్వింటాల్ మక్కలు (బిల్టి) ధర రూ.19,50, క్వింటాల్ పసుపు ధర రూ.12,000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్‌లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
RR: మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జాతీయ పరీక్షల్లో కేశంపేట(M) తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన హనితేజరెడ్డి సత్తా చాటారు. JEE మెయిన్‌లో 99.63% మార్కులు సాధించి తన ప్రతిభ చాటాడు. మారుమూల ప్రాంతంలో చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఆయన విజయంపై గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
VKB: మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు అయ్యప్ప కాలనీలో రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు నీరు వెళ్లడంతో ఈ మార్గాన వెళ్లే వాహనాలు ప్రజలు కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సంబంధిత వార్డు కౌన్సిలర్ స్పందించి ఈ సమస్యని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు డేట్, టైం ఖరారైంది. ఫిబ్రవరి 25న ఉదయం 10:14 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
BPT: వైద్య ఖర్చులకు పేదలు అప్పుల పాలు కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం రేపల్లె క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ.19.09 లక్షల విలువైన చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.
SKLM: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు మంగళవారం సందర్శించారు. మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలిగాంలో ఆదిత్య కళాశాల పరీక్షా కేంద్రాలను కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్‌లు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
KRNL: పెద్దకడబూరులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.1.90 కోట్ల వ్యయంతో 3.O కింద, NREGS పథకం మెటీరియల్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించాయి. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకంతరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: కూటమి ప్రభుత్వం హార్టికల్చర్‌కు ప్రోత్సాహంగా అరటి తోటలకు పండ్ల కవర్లపై 50% సబ్సిడీ ప్రకటించింది. రాజంపేటలో సుమారు 5,000 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. రైతులు కవర్లు కొనుగోలు చేసి బిల్లులు ఉద్యాన శాఖకు సమర్పిస్తే ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందుతుంది. గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు, అంటే రూ.25 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని అధికారులు తెలిపారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత లక్ష్మీనారాయణ రెడ్డి మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, స్వామివారి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరిని పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు.
KMM: వైరా ప్రాంతంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ఎకరాకు తగిన పరిహారం ప్రకటించాలి. పంట బీమా వర్తింపజేయడంతో పాటు, పాత రుణాలపై వడ్డీ మాఫీ చేసి, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్.మనోజ్ రెడ్డి మంగళవారం ఉదయం నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 17వ డివిజన్‌లో టీజీపీ పార్కును సందర్శించి పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 15వ డివిజన్‌లో ఏర్పాటు చేయనున్న సాగర్ కాలనీ పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
AP: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తిరుమల లడ్డూతోనే కాదు.. వైసీపీ పాలన విధ్వసంతోనే ప్రారంభమైందన్నారు. వందకు పైగా హిందువుల ఆలయాల్లో అపచారాలు చేశారని మండిపడ్డారు. నిజమైన బాధ్యులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులకు, ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత తమపై ఉందన్నారు.
AP: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తిరుమల లడ్డూతోనే కాదు.. వైసీపీ పాలన విధ్వసంతోనే ప్రారంభమైందన్నారు. వందకు పైగా హిందువుల ఆలయాల్లో అపచారాలు చేశారని మండిపడ్డారు. నిజమైన బాధ్యులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులకు, ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత తమపై ఉందన్నారు.