• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హెల్త్ సెంటర్‌లో కాయకల్ప బృందం తనిఖీ

MDK: కౌడిపల్లి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మిర్జాపూర్ కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రి పనితీరుపై ఆరా తీశారు. వైద్య సేవలు, నిర్వహణ పట్ల సూపరింటెండెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్లను అభినందించారు.

February 20, 2026 / 11:16 AM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్ల పరిశీలన

GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

February 20, 2026 / 11:15 AM IST

జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

NGKL: నాగర్‌ కర్నూల్ పేరు వెనుక చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్‌ కర్నూల్‌‌గా రూపాంతరం చెందింది. నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.

February 20, 2026 / 11:14 AM IST

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 11:13 AM IST

అసెంబ్లీలో సిమెంట్ ఫ్యాక్టరీల భూములపై గళమెత్తిన యరపతినేని

PLD: సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొన్న యాజమాన్యాలు, ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ నేడు అటు పొలం లేక, ఇటు పరిశ్రమలు రాక రైతులు కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 11:13 AM IST

వృక్షాల నరికివేత… ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు

NLG: చిట్యాల నుంచి ఉరుమడ్ల, నేరడ దారుల్లో, పెద్దకాపర్తి లోకి వెళ్లే దారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు మొండెం వరకు నరికివేశారు. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇలా నిర్దాక్షిణ్యంగా రంపంతో కోయడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 11:13 AM IST

ఆన్‌లైన్ గేమింగ్.. రూ.13 వేల కోట్ల మోసం

TG: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్‌తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్‌బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

February 20, 2026 / 11:12 AM IST

అనారోగ్యంతో మున్సిపల్ ఉద్యోగి మృతి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వేల్పుల భీమయ్య అనే ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్, కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, విజయరాణి తిరుపతి, మున్సిపల్ అధికారులు సాయికుంటలోని నివాసానికి వెళ్లి భీమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు.

February 20, 2026 / 11:11 AM IST

ఎల్లమ్మ, పొచ్చమ్మ గుడుల్లో చోరీ కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ RRO కాలనీలో ఎల్లమ్మ, పొచ్చమ్మ గుడుల్లో అర్థరాత్రి దొంగతనం జరిగింది తాళాలు పగులగొట్టి 2 హుండీలు, బంగారు నగలు, వెండి కిరీటాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఇద్దరు అనుమానితులు రికార్డు అయినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 11:10 AM IST

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.10 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, చేవెళ్ల మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 11:09 AM IST

వరంగల్ మార్కెట్లో ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,550 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18వేలు, టమాటా మిర్చి రూ. 37వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 20, 2026 / 11:06 AM IST

ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో ఆ రోడ్డుకి మహర్దశ

CTR: విజయపురం మండలంలో గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో మహర్దశ కలిగింది. విజయపురం మండలంలో ముత్యాలరెడ్డి కండ్రిగ, మంగళం మీదుగా విజయపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని పట్ల మండల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 11:05 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అస్వస్థత

HYD: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.

February 20, 2026 / 11:05 AM IST

ఆలయ వార్షికోత్సవాలకు ఆహ్వానం

SRD: నారాయణఖేడ్ శివారులోని శ్రీ భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర ఆలయంలో ఈనెల 23న ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు హనుమంతరావుపేట గ్రామంలోని సర్పంచ్, గ్రామస్తులకు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదేవిధంగా ఖేడ్‌లో కరణ్ గజేంద్ర భారతి మహారాజ్‌ను కూడా ఆహ్వానించి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 11:03 AM IST

విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: తిరుపతి

BHPL: గణపురం (M) కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ మొదలైంది. 6వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HM తిరుపతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు TGMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని HM సూచించారు.

February 20, 2026 / 10:59 AM IST