MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయమాధురి విద్యార్థులకు హెల్త్ చెక్ అప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
HNK: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం Jawaharlal Nehru Stadiumలో ప్రారంభమవుతున్నట్లు డీవైఎస్‌వో అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రీడల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,518 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
KMM: పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతర ఆదాయం రూ. 31,18,011 వచ్చినట్లు ఈవో రజనీకుమారి తెలిపారు. భక్తుల కానుకల ద్వారా రూ. 11.20 లక్షలు, బహిరంగ వేలం, ఇతర సేవల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 3,54,245 పెరిగిందని అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
JN: జిల్లా తరిగొప్పుల, స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్టకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన ఈ క్రీడాకారిణులను గురువారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, జీసీడీవో గౌసియా బేగం ప్రత్యేకంగా అభినందించారు.
NRPT: శివాజీ మహారాజ్ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. గురువారం నారాయణపేటలో నిర్వహించిన శోభాయాత్రలో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. శోభాయాత్ర జరిగే గణేష్ మార్గ్ గుండా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
AKP: మునగపాకలో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎస్.రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం ఊరేగింపు ఉంటుందన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్సీ తొలి సెమీస్‌లో భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ అనుష్క సంజీవని ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గత టోర్నీ(2023)లో ఇదే జట్ల మధ్య తొలి సెమీస్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. గ్రూప్ దశలో రన్‌రేట్ ఆధారంగా భారత్ నాటి టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.
SS: కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా పేకాట కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తలుపుల మండలంలోని గుండువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై చెన్నయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 12,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
E.G: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అప్ప చెప్పిన పార్టీ యొక్క బాధ్యతలు, పరిస్థితులు జగన్‌తో చర్చించారు. ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ, కార్యకర్తలకు అండదండలు అందించాలని సూచించారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: దేశపాత్రునిపాలెం వద్ద ఈనెల 2న రాత్రి గోకాడ పద్మ మృతికి కారణమైన కారును సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పాలకేంద్రం మూసేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందారు. ఏ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన కారు యాజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
ASF: అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని జైనూర్ పోలీసులు పట్టుకున్నారు. జైనూర్ నుంచి పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జామ్ గాం వద్ద పోలీసులు తనిఖీలు చేసి పశువులను తరలిస్తున్న ఐచర్ వ్యాన్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో 23 పశువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. పశువులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి నట్లు పేర్కొన్నారు.
ELR: జిల్లా కామవరపుకోట గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతరులకు మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకూడదని పేర్కొన్నారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
TG: ఎన్నికల జాబితాల పరిశుభ్రతను కాపాడడం EROల బాధ్యత అని CEC సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, HYD జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది EROలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే త్వరలో చేపట్టనున్న SIRపై చర్చించారు.