GDWL: అమరవాయి గ్రామ వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల అందుబాటును సులభతరం చేయడానికి సర్పంచ్ పి. హుస్సేన్ పంచాయతీలోనే పంపిణీ చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ని కలసి వినతిపత్రం అందజేశారు. అధికారి సానుకూల స్పందన తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.
JGL: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లాలో తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.
కర్నూలు కలెక్టరేట్‌లో JC నూరుల్ ఖమర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇళ్ల స్థలం, ఇతర ప్రయోజనాలను త్వరగా మంజూరు చేయాలని సూచించారు.
W.G: అంతర్జాతీయ మల్టీ టాలెంటెడ్ పురస్కారం, నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్, నంది అవార్డు అందుకున్న ఆకివీడుకు చెందిన ఘంటా షైనీని శుక్రవారం సన్మానించారు. ఆకివీడులోని స్థానిక ప్రైవేట్ స్కూల్ ఛైర్మన్ ఉండ్రమట్ల సాంబశివరావు సన్మానించి పదివేల రూపాయలు చెక్కును అందజేశారు. ఆకివీడు ఖ్యాతిని షైనీ దశదిశలా విస్తరింప చేస్తుందన్నారు.
BHNG: బీబీనగర్ మండలం ప్రాథమిక పాఠశాల వెంకిర్యాలలో విద్యార్థులందరికీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చెవి, ముక్కు, గొంతు, కళ్ళ, సైకియాట్రిస్ట్ డాక్టర్లు వ్యక్తిగతంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. అవసరమైన విద్యార్థులకు ఇయర్ డ్రాప్స్ అందించారు. విద్యార్థులకు కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేస్తానన్నారు.
కోనసీమ: ఈనెల 22న మంగళగిరి లో ఆదివారం జరగనున్న బీసీ సింహగర్జనను జయప్రదం చేయాలని ఆ సభకు వేలాదిగా బీసీలు తరలి వెళ్లాలని రాష్ట్ర బీసీవై ఎగ్జిక్యూటివ్ మట్ట వీరబాబు గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కొత్తపేటలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు.
MDK: చిన్నశంకరంపేట(మం) కామారం రెండో వార్డులో శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గడ్డం సుజాత, ఉప సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు. జీపీ నిధులతో ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సైట్ ఇంజినీర్ మహేందర్, గ్రామ కార్యదర్శి సుమలత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
NRPT: మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్, కౌన్సిలర్లు శుక్రవారం మక్తల్‌లో స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతరం మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.
E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మాజీ కార్పోరేటర్ రేలంగి శ్రీదేవి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఏసు పాల్గొని ప్రజల నుంచి మంచినీటి సమస్యలు, ఫీజు రియంబర్స్‌మెంట్, పింఛన్ల తదితర సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
BDK: ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో ప్రజా ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పేదలందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితోపాటు స్థానిక నూతన పాలకవర్గం పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో శుక్రవారం పలువురు లబ్దిదారుల ఇళ్లకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని. ముందుకురాని లబ్దిదారుల కోసం ప్రైవేట్ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
KDP: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు త్వరితగన పూర్తి చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో అలగనూరు రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఆరు నియోజకవర్గాల్లో 92 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు.
NDL: గోస్పాడు మండలంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. నెహ్రు నగర్ గ్రామంలో వైసీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం హనుమక్కపల్లిలో చిరుతపులి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.