ప్రకాశం: మార్కాపురంలో ఏబీ స్విచ్ ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డులో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
JN: కేసీఆర్ పై కడియం శ్రీహరి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి మోసం, ద్రోహం, అవకాశవాదానికి మరోపేరని విమర్శించారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే అతని రాజకీయ జీవితానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.
GNTR: పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం గుంటూరు నగరవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పాత మొబైళ్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు వీలుగా ప్రజలందరూ సహకరించాలన్నారు.
NZB: పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు.
VSP: వేపగుంట మండలం విరాట గర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. దీనివల్ల బాలాజీగార్డెన్స్, శ్రీనివాసనగర్, గొల్లనారాయణ పురం, దత్తసాయినగర్, సింహాద్రినగర్, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.
AKP: చెన్నైలో నేటి నుంచి 23 వరకు జరిగే ‘అండర్-15 సౌత్ జోన్ ఖేలో ఇండియా రగ్బీ’ జట్టు కోచ్‌గా అచ్యుతాపురానికి చెందిన వెంకట్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రగ్బీ అసోసియేషన్ ఏపీ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి నాగ వెంకటరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వెంకట్ అనకాపల్లి ప్రైవేట్ స్కూల్లో వ్యాయామం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు.
WGL: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీం RSI స్వాతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతి మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వినియోగించాలని తెలిపారు.
PPM: సాలూరు 11KV ఫీడర్ల వద్ద చెట్లుకొమ్మలు తొలగించే కార్యక్రమం నిర్వహిస్తున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE గోపాల్ నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస కాలనీ నుంచి జైపూర్ రోడ్డు వరకు, బంగారమ్మపేట, మరిపల్లి నుంచి రేగాపువలస వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానం సాధించింది. గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.
E.G: కొవ్వూరు మండలం వేములూరులో కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా శుక్ర, శనివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ 2రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అగ్రికల్చర్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి, ఓబులేసు అనే ఇద్దరికీ చీటింగ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5000 జరిమానాను బనగానపల్లె కోర్టు విధించినట్లు ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నిన్న విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందుతారని తెలిపారు. విషయాలను బాగా అవగాహన చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.
TG: సబర్బన్ ప్రయాణికులకు రైల్వే విభాగం శుభవార్త చెప్పింది. ‘రైల్‌వన్’ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకునే వారికి 6% రాయితీ అందిస్తోంది. జూలై 14 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పరిధిలో సబర్బన్ రైళ్లు, జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ బెదిరింపులకు దిగిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.