సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై తీవ్రంగా స్పందించింది. భర్త విద్యాసాగర్ మరణం నుంచి తాను ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం తన కూతురే తన ప్రపంచమని స్పష్టం చేసింది. ‘నేను ఒంటరి మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారా?’అని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని కోరాడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని పేర్కొంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. FEB 27న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. 2026 మార్చి 6న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. అయితే FEB 28న శ్రీవిష్ణు మరో సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ మూవీలో మహేష్ రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్. తాజాగా మైత్రీ సినిమాస్ వద్ద రాముడి గెటప్‌లో ఉన్న మహేష్ డిజిటల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ధనుస్సు పట్టుకున్న మహేష్ గంభీరమైన లుక్ చూసి రాజమౌళి సైతం తనకు ‘గూస్‌బంప్స్’ వచ్చాయని ప్రశంసించడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్, నయనికల పెళ్లి సందర్భంగా గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు, మెగా హీరోల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.
గతంలో తాను చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో అలా మాట్లాడినందుకు తాను కూడా చాలా బాధపడ్డానని, ఆ బాధతో రెండు రోజుల పాటు నిద్ర కూడా పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాటల వల్ల కలిగిన పరిణామాలను తలచుకుని ఎంతో మధనపడ్డానని, ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శివాజీ ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యాడు.
‘ధురంధర్’ సినిమా షూటింగ్ విశేషాలను నటుడు మాధవన్ తాజాగా పంచుకున్నాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తెలిపాడు. దర్శకుడు ‘కట్’ చెప్పగానే వారిద్దరూ కంటతడి పెట్టారని మాధవన్ గుర్తుచేసుకున్నాడు. ఆ సన్నివేశాల తీవ్రత వారిని అంతలా కదిలించిందని ఆయన వెల్లడించాడు.
సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. వృద్ధుడి గెటప్‌లో సత్యదేవ్ మేకోవర్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుందని సత్యదేవ్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించనుంది.
‘PS 2’లోని ‘వీర రాజా వీర’ సాంగ్‌కు డగర్ బ్రదర్స్‌కు క్రెడిట్ ఇవ్వడానికి AR రెహమాన్ సుప్రీంకోర్టులో అంగీకరించాడు. 5వారాల్లోపు SM, OTTలలో సవరించిన క్రెడిట్‌లు కనిపించాలని కోర్టు ఆదేశించింది. ‘శివస్తుతి’ నుంచి ఈ పాటను కాపీ చేశారని డగర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో డగర్వాణీ ధ్రుపద్ సంప్రదాయం పేరుతో క్రెడిట్స్ ఇచ్చేందుకు రెహమాన్ ఓకే చెప్పాడు.
స్టార్ మా: రాజా ది గ్రేట్(9AM); జీతెలుగు: రౌడీ బాయ్స్(9AM); ఈటీవీ: సందడే సందడి(9AM); స్టార్‌మా మూవీస్: సప్తగిరి LLB(7AM), వినయ విధేయ రామ(9AM), వీర సింహారెడ్డి(12PM), పోకిరి(3PM), K-ర్యాంప్(6PM), సలార్(9PM); జీ సినిమాలు: కొంచెం ఇష్టం కొంచెం కష్టం(7AM), విన్నర్(9AM), ఆర్యన్(12PM).
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాతో మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ‘భూత్ బంగ్లా’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె తన చెల్లెలి పాత్రలో కనిపిస్తుందని అక్షయ్ తెలిపాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.
బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్‌మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్‌మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్‌షీట్‌లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భాగమ్ భాగ్’కు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షితో పాటు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించనున్నాడు.