W.G: భీమవరం శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ‘బ్యాండ్ మేళం’ చిత్ర హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా భీమవరం వచ్చినట్లు రోషన్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వేసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పురోహితుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
E.G: వేసవిలో కరెంటు సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఏపీ డీసీఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు రాకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
TPT: దేశంలో మొదటిసారిగా శివాలయంగా గుర్తింపు పొందిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు ముందుగా ఈనెల 8వ తేదీ నుంచి బాలాలయం ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడుకి నియోజకవర్గ మాజీ టీడీపీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు, మాననీయత సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు కోరారు. ముఖ్యంగా ముంబై వెళ్లందుకు రైలు సౌకర్యం లేదని, హైదరాబాదుకు మరిన్ని రైళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కోణార్క్, ఫలక్ నామా రైలును చీపురుపల్లి స్టేషన్లో నిలపాలన్నారు.
అనకాపల్లి జిల్లాలో 8 బాణసంచా కేంద్రాలు ఎన్ఓసీలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారికంగా 11 బాణసంచా కేంద్రాలు ఉండగా నిబంధనలు పాటించని ఎనిమిది కేంద్రాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలు జారీ చేయలేదు.
ELR: ఉంగుటూరు మండలంలో వేరు వేరు చోట్ల పేకాట స్థావరాలపై దాడి చేశామని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ శనివారం రాత్రి తెలిపారు. కాగుపాడు లో 8 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద రూ. 20,600లు నగదు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్న మన్నారు . నాచుగుంటలో నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని, రూ. 3100 నగదు, ఆరు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
PPM: కొమరాడ మండలం దలాయిపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సోమవారం సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి ప్రవేశించి వరి, అరటి, మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు.
NDL: బేతంచర్ల మండలంలోని నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా పైపులైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SS: పుట్టపర్తికి చెందిన కుశాల్ దాస్‌గుప్తకు ప్రతిష్టాత్మకమైన “ప్రైడ్ ఆఫ్ కర్ణాటక – మహాదేవపుర రత్న అవార్డు 2026” లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అరవింద్ లింబావళి చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. సామాజిక సేవ, ఫిల్మ్ మేకింగ్, వినూత్న విజువల్ డిజైన్ రంగాల్లో చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది.
GNTR: తెనాలి త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్ధనరావు పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది 5 గంటల నుంచే కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని సోదా చేశారు. అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ఏరియాలో సోమవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కాలనీవాసులు కాళీ ప్రదేశంలో చెత్తను డంపు చేశారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే కమీషనర్ చెత్తను తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజీ కాలువలపై సేఫ్టీ గా బండలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్‌కు సూచించారు.
NDL: నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో ఎద్దడి ఏర్పడిందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలనిన్నారు.
E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.
నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.