• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పెన్నులు అట్టలు పంపిణీ

AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 04:50 PM IST

జైభీమ్ ఎమ్మార్పీఎస్ నేతకు పరామర్శ

KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

February 20, 2026 / 04:49 PM IST

‘రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలి’

ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

February 20, 2026 / 04:46 PM IST

అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

KRNL: పత్తికొండలో చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు . మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇళ్ల తలుపులు, వాహనాలు సురక్షితంగా లాక్ చేసుకోవాలని, సూచించారు.

February 20, 2026 / 04:46 PM IST

ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హానికరం

ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.

February 20, 2026 / 04:45 PM IST

అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐసీడీఎస్ పీడీ

KRNL: ఆదోని పట్టణ పరిధిలోని తిక్క స్వామి దర్గా ప్రాంతంలోని అంగనవాడీ కేంద్రం 85ను శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , సీడీపీఓ ఢిల్లీ ఈశ్వరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, పీడీ విజయ పిల్లలు హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే పిల్లలుకు ఇస్తున్న ఆహరం, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందు సరుకుల నిలువ, కేంద్రం పరిశుభ్రతను తనిఖీ చేశారు.

February 20, 2026 / 04:43 PM IST

‘సహకార సంఘ ఉద్యోగులకు సీఎం సహకరించాలి’

ELR: సహకార సంఘ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సహకరించాలని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చాట్రాయి కోపరేటివ్ యూనియన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద నూజివీడు నియోజకవర్గ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు

February 20, 2026 / 04:41 PM IST

లడక్ శిక్షణకు విద్యార్థి ఎంపిక

SKLM: మెలియాపుట్టి మండల ZPHSకు చెందిన వీ. జ్ఞాన సాయి ఉన్నత ప్రతిభ కనబరిచారు. జ్ఞాన సాయి అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో శిక్షణ పొంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లడక్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు 1,2లు యస్. దేవేంద్రరావు, ఎం. పద్మనాభం,పాఠశాల H.M గీత, ఉపాధ్యాయులు జ్ఞాన సాయిని ఘనంగా సత్కరించారు.

February 20, 2026 / 04:41 PM IST

గిరిజన జీవనోపాధిపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

విశాఖలోని ICAR-CMFRI రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజనులకు శుక్ర‌వారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపు, జలాశయాలు–చెరువుల శాస్త్రీయ వినియోగంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మత్స్య సంపద, ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

February 20, 2026 / 04:38 PM IST

బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

BPT: కర్లపాలెం మండలం పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్యానెల్ లాయర్ దగ్గుమల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తికాకుండా వివాహం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.

February 20, 2026 / 04:36 PM IST

కోడూరు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత

అన్నమయ్య: మహాశివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని గుండాలకోన, చిట్వేల్ మండలంలోని ఎండ్రకాయ కోనలో అటవీ శాఖ అధికారులు సేవలందించారు. వీరితో పాటు కోడూరు సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు ప్రతిభ చూపడంతో రేణిగుంట DSP శ్రీనివాసరావు విశిష్ట ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా సేవలందించినందుకు ప్రశంసించారు.

February 20, 2026 / 04:34 PM IST

SBI సీఎస్ఆర్ నిధులతో రేణిగుంట PHCకి వైద్యపరికరాలు

TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో స్టేట్ బ్యాంక్ ముందుంటుందని చెప్పారు.

February 20, 2026 / 04:34 PM IST

‘ఉద్యోగ భద్రత కల్పించాలి’

PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్‌ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన గిరి శిఖర గ్రామాల నుంచి గర్భిణీలు, రోగులను PHCకు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు.

February 20, 2026 / 04:32 PM IST

అగ్నిమాపక శాఖ తరపున ప్రజలకు సూచనలు

CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు జరిగితే 08581-253101 సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:30 PM IST

‘పోలియో రహిత ప్రపంచమే రోటరీ లక్ష్యం’

VZM: రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డా. వై కళ్యాణ్ చక్రవర్తి పోలియో నిర్మూలనే రోటరీ ధ్యేయమని శుక్రవారం తెలిపారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టి బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించారని, దీనిపై అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం క్లబ్ కార్యక్రమాలు సమీక్షించి రోటరీ బస్ బే ప్రారంభించి, విద్యార్థులకు టీ షర్టులు పంచారు.

February 20, 2026 / 04:27 PM IST