KRNL: హోలీ పండుగ సందర్భంగా కర్నూలు మార్కెట్ కమిటీ యార్డుకు నేడు సెలవు ప్రకటించామని, రైతులు అమ్మకానికి తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం యథావిధిగా మార్కెట్ కమిటీ యార్డులో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు.
NLR: సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన మెడలోని 13 సవర్ల బంగారు సరుడు పోయిందని స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలు.. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జ్యోతి నెల్లూరులో ఉంటుంది. సోమవారం తమ ఊరికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి పొదలకూరు బస్సుకు వెళ్లే క్రమంలో తన మెడలో నగ కనిపించకపోయిందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం సాయంత్రం లారీ-కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు సహాయంతో 108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం కొవ్వూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల పోస్టర్లను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు మార్చి 4 నుంచి ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు ‘మై భారత్’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో మంగళవారం కూరగాయల ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. కాప్సికంకు రూ.57తో అత్యధిక ధర పలికింది. ఫ్రెంచ్‌బీన్స్ రూ.51, క్యారెట్ రూ.27గా నమోదు కాగా, టమాటా రూ.12, బీరకాయ రూ.20గా విక్రయమయ్యాయి. పచ్చిమిర్చి రూ.33, వంగ రూ.14-16 వరకు లభించగా, దొండ రూ.22, బెండ రూ.18గా ఉన్నాయి. బంగాళాదుంప, బీట్‌రూట్, ఉల్లిపాయలు రూ.23, దోసకాయ రూ.20గా ఉన్నాయి.
కోనసీమ: రామచంద్రపురం పట్టణం, మండల పరిధిలోని ఓదూరు, నరసాపురపుపేట తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ.1.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
VZM: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. APNRTS కో-ఆర్జినేటర్ల ద్వారా బాధితులకు ఇప్పటికే తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని, బాధితులందరినీ త్వరలోనే స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని నాయుడు కాలనీకు చెందిన పెంట రాకేశ్ కుమార్ ఒకేసారి 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. సోమవారం విడుదలైన బ్యాంకు ఫలితాలలో రాకేశ్ కెనరా బ్యాంకు పీవో, రీజనల్ రూరల్ బ్యాంకు పీవో, స్టేట్ బ్యాంకు క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్ ఉద్యోగం సాధించారు. మూడో ప్రయత్నంలో ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించాడు.
ATP: బ్రహ్మసముద్రం మండలంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడు బండి సుబ్రహ్మణ్యంను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.లక్షన్నర విలువైన బంగారు గొలుసు, స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇతడు, జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్ళీ నేరాలకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు.
NDL: నాటు సారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరిలో 19 గ్రామాలు, బీ కేటగిరీలో 19 గ్రామాలు, సీ కేటగిరీలో 91 గ్రామాలలో నాటు సారాను పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.
E.G: ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరాంజనేయులు సింగంపల్లిలో సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు పెరుగుతున్నప్పటి, మహిళల రక్షణ కరువుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మాదకద్రవ్యాలు నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: రావులపాలెం మండలంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవరపల్లి గ్రామ సర్పంచ్, మాజీ మండల వైసీపీ అధ్యక్షులు దొమ్మేటి అర్జున రావు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం కొత్తపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దొమ్మేటికి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు హోళీ పండుగ సందర్భంగా మంగళవారం రోజును సెలవుగా ప్రకటించారు. అకాడమిక్ క్యాలెండర్‌లో సెలవుగా ఉన్న బుధవారం రోజును సాధారణ పనిదినంగా నిర్వహించనున్నారు. ఆ రోజు 10వ తరగతి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి SA-2 పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, సిబ్బందికి సూచించారు.
PLD: నకరికల్లులో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గాజులగడ్డ, యాసం బజారు, ఎన్టీఆర్ బొమ్మ, జీడీసీసీ బ్యాంకు, గాంధీ బొమ్మ పరిసర ప్రాంతాల్లో కరెంటు ఉండదు. ఈ ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) పాఠశాలను మంత్రి సవిత సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెరుగైన విద్యా ప్రమాణాల కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.