KRNL: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పెద్దకడబూరు టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు హాజరయ్యారు. పెద్దకడబూరు మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.
BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ. 50,95,248 విలువైన చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం చేపట్టే ఈ కార్యక్రమంలో సి.ఐలు,ఎస్.ఐలు,సిబ్బంది పాల్గొని స్టేషన్లు,పరిసరాలను శుభ్రం చేశారు.చెత్త తొలగింపు,పిచ్చి మొక్కల నిర్మూలనతో పాటు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
W.G: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆకివీడు పులవర్తి లక్ష్మణస్వామి జడ్పీ హైస్కూల్లో శనివారం సౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. 1984-85 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.80,000 వ్యయంతో దీనిని పాఠశాలకు కానుకగా ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠనాయుడు విద్యార్థుల సమక్షంలో దీనిని ప్రారంభించి, పూర్వ విద్యార్థుల సేవా గుణాన్ని అభినందించారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని ఏడో వార్డులో శనివారం స్వచ్ఛంద – స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి వీధిలో శుభ్రత, చెత్త తొలగింపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
అన్నమయ్య: ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజేంద్ర ప్రసాద్‌ను హైదరాబాద్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమకాలీన అంశాలు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించారు. యువతకు ప్రేరణగా నిలుస్తున్న రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో కేశ్వర్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల వివరాలను 2025 జాబితాతో అనుసంధానం చేసే (Mapping) కీలక ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
PPM: సీతానగరం మండలం జోగింపేట కేజీబీవీ హాస్టల్ విద్యార్దినీలకు MLHPలోకేశ్వరి శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెమోగ్లోబిన్, జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తగినంత నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
VZM: వంగర ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు శనివారం స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వలన భూగర్భ జలాలు పాడైపోతున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని డిప్యూటీ ఎంపీడీవో రామారావు కోరారు.
కోనసీమ: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆరోపించారు. శాసనమండలిలో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు అపచారంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఈనెల 25వ తేదీన ఎల్లమ్మ జాతర జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఎల్లమ్మ పూజారి రుద్రాక్షల సత్యం, పరశురామున్న పూజారి కర్ణకోట కసవయ్యలు సిరిమాను అధిరోహిస్తారని చెప్పారు. 24న తోలేల ఉత్సవం, 26న కనుము జరుపుతారని తెలిపారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి అనంతరం జరుగుతుందన్నారు.
PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తోట శంకరరావు మాట్లాడుతూ.. భాషల వైవిధ్యాన్ని కాపాడటం, మాతృభాషపై గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ అధికారులతో MLA సమావేశమై మాట్లాడారు. గ్రామాల వారీగా కొత్తగా విద్యుత్ పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు తదితర విద్యుత్ సమస్యల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
VZM: బొబ్బిలి MLA బేబినాయన శనివారం స్దానిక MPDO కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎర్పాటు చేసిన స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఈ రథం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.