VSP: బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం(విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.
CTR: పలమనేరు విద్యుత్ సబ్ స్టేషన్‌లో శనివారం మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్టు డీవైఈఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించి సహకరించాలని కోరారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులలో ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అనుమానితులను మొబైల్ స్కానింగ్ పరికరాలతో తనిఖీ చేస్తున్నారు.
PLD: వినుకొండ పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష కోసం వినుకొండ వచ్చిన ఎస్పీని, సీపీఐ పట్టణ కార్యదర్శి రాము నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఈ విజ్ఞప్తిని చేశారు.
గుంటూరు బృందావన్ గార్డెన్స్‌కు చెందిన నాలి గురుబ్రహ్మం, శాంతి దంపతులు శుక్రవారం మార్టూరు సమీపంలోని రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అద్దంకిలో ఉన్న కుమార్తెను చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా, బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
SKLM: సారవకోట(మం) తర్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకులు, జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు ఎంపీపీ బైరగినాయుడు ఉన్నారు.
BPT: బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు ZP హైస్కూల్‌లో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ 208 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ప్రకాశం: సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమాన అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా చేయడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
E.G: స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ శాఖలకు విధాన రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు సేవలు ముందస్తుగా అందించేందుకు అవసరమైన సమగ్ర డేటాను సేకరించడం సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు. RTGS డేటాను పూర్తి స్థాయిలో సక్రమంగా నమోదు చేయాలన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు కనిపించే విధంగా డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించాలన్నారు. విధులకు సక్రమంగా హాజరు కావాలన్నారు.
KRNL: ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని ఇవాళ నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ తెలిపారు. బీపీ, షుగర్, ఒబిసిటీ కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత కిడ్నీ మార్పిడి జరుగుతుందని, మార్పిడి అనంతరం సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. ఆదోనిలో గురు, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం అచ్చుతాపురంలో ఫార్మా కంపెనీలను సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, క్వాలిటీ ఇష్యూరియన్స్ డిపార్ట్మెంట్, వాటర్ ప్యూరిఫికేషన్ డిపార్ట్మెంట్‌లను సందర్శించారు.
కడప II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పథకం పన్నిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయేషా వీధిలో బుర్కాలు, కత్తులు, కారంపొడితో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విజిబుల్ పోలీసింగ్‌లో ఉన్న సిబ్బంది వారిని పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద నుంచి నేరానికి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శుక్రవారం అవుకు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణతో పాటు రిసెప్షన్, స్టోర్ రూమ్, లాకప్ గదులు, రికార్డు గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించమని సూచించారు.
KDP: జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలం రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. కోసిన శనగ పంటను బాగా ఆరబెట్టి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు.