ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. వాట్సాప్ కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా లింక్డ్ డివైజెస్లోనూ కాంటాక్ట్‌ను యాడ్ చేసే అవకాశం కల్పించనుంది. అలాగే కాంటాక్ట్‌ను కేవలం వాట్సాప్‌లోనే సేవ్ చేసేలా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్లు త్వరలోనే వాట్సాప్, విండోస్‌లో అందుబాటులోకి రానున్నాయి.