స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వార్షిక లాభాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామని బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘనతను రానున్న 3-5 ఏళ్లలో అందుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. 2023-24లో SBI రూ.61,077 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21.59 శాతం అధికమని చెప్పారు. కార్పొరేట్ రుణాలకు గిరాకీ బాగుందని.. ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల రుణాలకు దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయన్నారు.