ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెటా AIలో మూడు సరికొత్త ఫీచర్లను జోడించింది. AI సంభాషణల్ని మరింత మెరుగుపరచడం కోసం రియల్ టైం కన్వర్జేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలాగే ఫొటోలను నచ్చినట్లుగా తీర్చిదిద్దే ఫీచర్లను కూడా జోడించింది. వీటితో పాటు ఫొటోతో సెర్చ్ చేసి.. అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కొత్త ఫీచర్లకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ తన బ్లాగ్‌పోస్ట్‌లో షేర్ చేసింది.