E.G: సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో యనమదల యేసు అనే రైతుకు సంబంధించిన వరిగడ్డి వాము బుధవారం అగ్నికి హాహుతి అయింది. ఈ గడ్డివాము వలువ సుమారు రూ. 40,000 విలువ చేస్తుందని స్థానికులు తెలిపారు. ఈ ఘలనతో సదరు రైతు కుటుంబం దుఃఖంలో మునిగి పోయింది. కాగా ఈ గడ్డివాము దగ్ధంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.