ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎస్24FE పేరిట కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. 6.7 అంగుళాల డిస్ ప్లే, ఎగ్జినోస్ 2,400 చిప్ సెట్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 4,700mah బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పటికే ప్రీ- ఆర్డర్లు ప్రారంభమైన ఈ ఫోన్ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.65,999. వచ్చే నెల 3 నుంచి రిటైల్ అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.