ఆన్లైన్ ఆర్డర్లు ద్వారా ఆహారాన్ని వినియోగదార్లకు డెలివరీ చేసే స్విగ్గీ.. IPOకు రానుంది. ఈ IPO ద్వారా రూ.3,750 కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో భారత్‌లో ఈ ఏడాది అత్యధికంగా లిస్టింగ్ చేసిన కంపెనీల్లో ఒకటిగా స్విగ్గీ నిలువనుంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ పెట్టుబడులున్న ఈ సంస్థను 2014లో స్థాపించారు. దేశంలోని 15,000 రెస్టారెంట్లతో స్విగ్గీకి ఒప్పందం ఉంది.