సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఇది వర్తిస్తుందని తెలిపింది. సాధారణ ఖాతాదారులకు 4 శాతం నుంచి గరిష్ఠంగా 8.60 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం మధ్య రాబడిని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులకు వర్తించనుంది. 6 నెలలకు ఒకరోజు కాలవ్యవధిపై డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ ఇస్తుంది.