Invoice Bills: బిల్ అప్ లోడ్ చేయండి..కోటి రూపాయలు గెల్చుకోండి
కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీం ప్రవేశపెట్టింది. అదే మేరా బిల్ మేరా అధికార్'. దీని ద్వారా ఆయా సంస్థలు లేదా టోకు వ్యాపారులు మొబైల్ యాప్‌లో GST ఇన్‌వాయిస్‌ని అప్లోడ్ చేసి కోటి రూపాయల వరకు రివార్డులు గెల్చుకోవచ్చు.
కొనుగోళ్లకు సంబంధించి ఇన్వాయిస్లు/బిల్లులు అడిగే కస్టమర్ల సంస్కృతిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ‘మేరా బిల్ మేరా అధికార్’ పేరుతో సరికొత్త ‘ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని’ ప్రారంభిస్తోంది. ఈ పథకం లక్ష్యం సాధారణ ప్రజలలో మార్పు, వారి హక్కుగా ‘ఆస్క్ ఫర్ ఎ బిల్’ తీసుకురావడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. ఈ పథకం సెప్టెంబర్ 1, 2023న ప్రారంభించబడుతుంది.
ఈ పథకం ప్రారంభంలో అస్సాం, గుజరాత్ & హర్యానా, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ వంటి ప్రాంతాల్లో పైలట్‌గా మొదలవుతుంది. వినియోగదారులకు జారీ చేసిన అన్ని B2C ఇన్వాయిస్లు ఈ పథకానికి అర్హులు. లక్కీ డ్రా కోసం పరిగణించబడే ఇన్వాయిస్ల కనీస విలువ రూ.200గా ఉండాలి. వీటిని IOS, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్ ‘మేరా బిల్ మేరా అధికార్’లో లేదా వెబ్ పోర్టల్ ‘web.merabill.gst.gov.in’లో ఇన్వాయిస్లను అప్లోడ్ చేయవచ్చు.
అయితే ఇండియాలో నివాసితులందరూ వారి రాష్ట్రం/UTతో సంబంధం లేకుండా ఈ పథకంలో పాల్గొనడానికి అర్హులని ప్రకటించారు. ఈ లక్కీ డ్రా కోసం గరిష్టంగా 25 ఇన్వాయిస్లను ఒక వ్యక్తి యాప్/వెబ్ పోర్టల్‌లో ఒక నెలలో అప్లోడ్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి ఇన్వాయిస్కు అక్నాలెడ్జ్మెంట్ రిఫరెన్స్ నంబర్ (ARN) ఉంటుంది. ఇది బహుమతుల డ్రా కోసం ఉపయోగించబడుతుంది. విన్నింగ్ ఇన్వాయిస్లు రెగ్యులర్ వ్యవధిలో (నెలవారీ/త్రైమాసికానికి) రాండమ్ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు.