టీ(Tea)కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. టీ తాగని వారంటూ ఎవ్వరూ ఉండరు. మన దేశంలో అత్యంత వేగంగా ఉత్పత్తి చెందుతున్న ఉత్పత్తుల్లో టీ కూడా ఒకటి. భారత దేశంలో 25 శాతానికి పైగా ప్రజలు టీ లేకుండా ఉండలేరు. సొంతంగా వ్యాపారం(Business) చేయాలనుకునేవారికి ఈ టీ బ్యాగ్ వ్యాపారం మంచి ఆదాయాన్ని అందిస్తుంది. టీ బ్యాగ్ అనేది ఒక చిన్న, సన్నని చిల్లులు ఉండే బ్యాగ్. ఆ బ్యాగ్ లోపల టీ ఆకు ఉంటుంది. ఒక కప్పు వేడి నీటిలో టీ బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది.
ఇటువంటి టీ బ్యాగ్ వ్యాపారం చేసేవారికి కచ్చితంగా వివిధ రిజిస్ట్రేషన్లు, లైసెస్సులో ఉండాలి. టీ బ్యాగ్ వ్యాపారం(Tea Bags Business)లో ముఖ్యంగా ఆహారం, నాణ్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి టీ ట్రీ ఆయిల్ ని వినియోగించాలి. మార్కెట్లో ఇప్పుడు ఆర్గానిక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, అస్సాం టీ, మిక్స్ టీ వంటి రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఒక బ్యాగులో 4 ఔన్సుల టీ ఆకులు ఉంచుతారు. టీ బ్యాగ్ వ్యాపారం(Tea Bags Business) ప్రారంభించేందుకు కొన్ని యంత్రాలు అనేవి అవసరం ఉంటుంది. టీ బ్యాగ్ తయారీ యంత్రం ధర రూ.1,75,000 ఉంది. ముడి సరుకుల ధర చూస్తూ దాదాపుగా రూ.25,000 వరకూ ఉంటుంది. ఇకపోతే యంత్రాలు, ఇతర ఖర్చుల కోసం రూ.1 లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.
టీ బ్యాగుల(Tea Bags Business) ప్యాకేజింగ్ కోసం రూ.25,000 వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ఖర్చులకు మరో రూ.25 వేలు పెట్టుకోవాలి. ఇవి కాకుండా మీ వద్ద రూ.2,50,000 అదనంగా ఉంచుకోవాలి. టీ బ్యాగులు వ్యాపారంలో తర్వాతి దశ మార్కెటింగ్. టీ బ్యాగులను స్థానికంగా లేదా టోకు దుకాణాల్లో అమ్మవచ్చు. అందుకోసం సంస్థ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే B2B వెబ్సైట్లు, B2C వెబ్సైట్లలో టీ బ్యాగ్ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసి విక్రయించవచ్చు. సూపర్ మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు, చిన్న దుకాణాలలో అమ్మడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు.