»Shopping Online With New Google Feature May Help You Save Thousands Of Rupees Here Is Ho
Google : గూగుల్ కొత్త ఫీచర్.. షాపింగ్ డీల్స్ తెచ్చింది.. టైం మనీ.. ఫుల్ సేవ్
ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త. Google సెర్చింజన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంజిన్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. దీనితో వినియోగదారులకు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉత్పత్తులు, వాటి ధరలు కలిపి చూపబడతాయి.
Google : ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త. Google సెర్చింజన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంజిన్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. దీనితో వినియోగదారులకు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉత్పత్తులు, వాటి ధరలు కలిపి చూపబడతాయి. దీనివల్ల ప్రొడక్ట్ ఎక్కడ తక్కువ ధరలో లభిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. దాంతో పాటు వేల రూపాయలు ఆదా చేయవచ్చు. గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి, వినియోగదారుల కోసం కొత్త పేజీ తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ పేజీలో వివిధ ఆన్లైన్ రిటైలర్లు, బ్రాండ్ల నుండి స్పెషల్ డీల్ లు చూపిస్తుంది. ఈ పేజీ ద్వారా ఏ ప్రొడక్ట్ ఏ ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో తక్కువ ధరకు దొరుకుతుందో ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వినియోగదారులకు ప్రత్యేక డీల్స్ పేజీలో వేల బ్రాండ్ల నుండి లక్షలాది ఉత్పత్తులు ప్రమోషనల్ డిస్కౌంట్లతో లభిస్తాయని గూగుల్ రాసింది. ఈ పేజీలో వివిధ రిటైలర్ల నుండి జాబితా చేయబడిన ఉత్పత్తులను చూడటం అంటే Flipkart, Amazon , Myntra వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉత్పత్తులు ఒకే చోట కనిపిస్తాయి. ఈ మార్పుతో వినియోగదారులు ఇంటర్నెట్లోని వివిధ షాపింగ్ సైట్లను సందర్శించాల్సిన అవసరం లేకుండానే స్పెషల్ డీల్‌ను కనుగొనగలరని కంపెనీ భావిస్తోంది. కొత్త డీల్స్ పేజీలో అపెరల్, ఎలక్ట్రానిక్స్, టాయ్స్, బ్యూటీ వంటి వివిధ కేటగిరీల ఉత్పత్తులను వినియోగదారులకు చూపించనున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్పత్తులు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు లగ్జరీ రిటైలర్లు, బ్రాండ్లు మరియు ఆన్లైన్ స్టోర్ల నుండి లిస్ట్ చేయబడతాయి. కొత్త పేజీకి వెళ్లడానికి, వినియోగదారులు గూగుల్ సెర్చ్‌లో ‘షాప్ డీల్స్’ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. మీరు నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకుంటే మీరు దాని పేరు లేదా కేటగిరితో పాటు ‘షాప్’ అని వ్రాసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.