ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India – SBI) వినియోగదారులు (Customers) సోమవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీఐ సర్వర్ డౌన్ (SBI server down) కావడంతో నెట్ బ్యాంకింగ్ (net banking transactions), యూపీఐ (UPI) సేవల్లో అంతరాయం కలిగింది. యోనో యాప్ లోను (YONO App) సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా పిర్యాదులు చేసారు. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ఇండియా కూడా ఎస్బీఐ కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి వినియోగదారుల నుండి పిర్యాదులు వస్తున్నట్లు తెలిపింది. కొంతమంది ఆదివారం నుండే ఈ సమస్యను తాము ఎదుర్కొన్నట్లు ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు. రెండు మూడు రోజులుగా ఎస్బీఐ ఆన్ లైన్ సేవల్లో ఇబ్బందులు చూస్తున్నట్లు ఇంకొంతమంది చెప్పారు.
ఆర్థిక సంవత్సరం (Financial Year) ప్రారంభం నేపథ్యంలో ఎస్బీఐ (SBI) తమ ఆన్ లైన్ సేవలకు ఏప్రిల్ ఒకటో తేదీన స్వల్ప విరామం ఇచ్చింది ఎస్బీఐ. ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయం నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విట్టర్ హ్యాండిల్ వెల్లడించింది. కానీ అప్పటి నుండి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.