»Rapid Rail Rapid Rail Fare Rapid Rail Fare Fare List
Rapid Rail: ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
దేశం.. తన మొట్టమొదటి ర్యాపిడ్ రైలు బహుమతిని త్వరలో అందుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న దేశంలోని సాధారణ ప్రజలకు ర్యాపిడ్ రైలును అంకితం చేయనున్నారు.
Rapid Rail: దేశం.. తన మొట్టమొదటి ర్యాపిడ్ రైలు బహుమతిని త్వరలో అందుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న దేశంలోని సాధారణ ప్రజలకు ర్యాపిడ్ రైలును అంకితం చేయనున్నారు. దీంతో సామాన్యుల సేవలో పట్టాలపై గాలి వేగంతో ర్యాపిడ్ రైల్ పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఈ ర్యాపిడ్ రైలు ప్రారంభంతో ఢిల్లీ-ఎన్సీఆర్ నుంచి మీరట్‌కు ప్రయాణం మరింత సులభతరం కానుంది. విశేషమేమిటంటే ర్యాపిడ్ రైల్ 17 కిలోమీటర్ల రైలు ఛార్జీలను ప్రకటించింది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు వెళ్లేందుకు అత్యల్ప ధర రూ.20గా, ప్రీమియం క్లాస్‌లో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు అత్యల్ప ధర రూ.40గా నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ రైలు సాహిబాబాద్ నుండి దుహై డిపో వరకు సాధారణ ప్రజల కోసం తెరవబడింది. సాహిబాబాద్ – దుహై డిపోల మధ్య ఛార్జీ రూ.50. మీరు సాహిబాబాద్ నుండి ఘజియాబాద్‌కు రూ. 30, సాహిబాబాద్ నుండి గుల్ధార్కు రూ. 30 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ రైల్ విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం, సాహిబాబాద్ నుండి దుహై డిపోకు ప్రీమియం తరగతి ధరను రూ.100గా నిర్ణయించారు. కాగా సాహిబాబాద్ నుంచి ఘజియాబాద్‌కు రూ.40. అదేవిధంగా సాహిబాబాద్ నుంచి గుల్ధార్కు ప్రీమియం తరగతి ధర రూ.60. అయితే, ప్రీమియం క్లాస్‌లో సాహిబాబాద్ నుండి దుహైకి వెళ్లడానికి రూ. 80 ఖర్చు చేయాల్సి ఉంటుంది. విశేషమేమిటంటే 90 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
టిక్కెట్ల కోసం డిజిటల్ QR కోడ్ ఆధారిత టికెట్ మోడ్ కూడా ప్రారంభించబడింది, మీరు Rapidex Connect యాప్ ద్వారా పొందవచ్చు. దీనితో పాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC కార్డ్) సదుపాయం కూడా చేయబడింది. ఈ రైలులో ఢిల్లీ మెట్రో కార్డ్ పని చేయదు. NCMC కార్డ్ కనీస విలువ రూ. 100తో రీఛార్జ్ చేసుకోవచ్చు. కాగా, గరిష్ట విలువ రూ. 2000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్ రీడర్లతో కూడిన టికెట్ వెండింగ్ మెషీన్లు ప్రతి స్టేషన్లో అమర్చబడి ఉంటాయి. దీనితో పాటు రూపే, మాస్టర్, వీసా, స్టాండర్డ్ కార్డులను కూడా ఇక్కడ డబ్బు లావాదేవీలకు ఉపయోగించవచ్చు.