ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలో రేపు 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్నారు. 5జీ సేవలు మొట్ట మొదట ఏ ఏ ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయనే విషయంలో స్పష్టం లేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందు కొన్ని నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ తర్వాత నెమ్మదిగా కొన్నేళ్లకు దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరిస్తుందని ప్రభుత్వ సమాచార విభాగం PIB ట్వీట్ చేసింది.
ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో 5జీ సేవల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అందుతున్న వేగం కన్నా 10 రెట్ల వేగంతో 5జీ సేవలు ఉండనున్నాయని మోడీ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 5జీ సేవల గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు, రెండు మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.