»Pnb Customers Alert Bank To Deduct Money From Your Account On Failed Atm Withdrawal
PNB Customers Alert! అలా డబ్బులు తీస్తే షాక్ తప్పదు, కొత్త ఛార్జీలు
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా… అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది. ఖాతాలో డబ్బులు సరిగ్గా లేకుండానే ఏటీఎం నుండి డబ్బు తీసుకోవాలనుకుంటే ఫెయిల్ అయితే పది రూపాయల పెనాల్టీతో పాటు జీఎస్టీ పడుతుంది. మే 1వ తేదీ నుండి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ‘డియర్ కస్టమర్స్ 01.05.2023 తేదీ నుండి ఖాతాలో డబ్బులు లేకుండానే డొమెస్టిక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రాయల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ.10 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది.’ పంజాబ్ నేషనల్ బ్యాంకు తన వెబ్ సైట్లో పేర్కొన్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏటీఎం నుండి డబ్బులు ఉపసంహరించుకునే ఉద్దేశ్యం ఉంటే.. ముందుగా బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత విత్డ్రా చేసుకోవడం మంచింది. అలాగే, ఈ బ్యాంకు ఇతర చార్జీలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్ కార్డు లేదా ప్రిపెయిడ్ కార్డుల వార్షిక ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు వంటివి పెంచనుందని సమాచారం. పీఓఎస్ మెషీన్, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఈకామర్స్ ట్రాన్సాక్షన్లపై కూడా చార్జీలను పెంచనుంది.