ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టింది. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి చెందిన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
భారతదేశపు అతిపెద్ద క్యాసినో చైన్ డెల్టా క్రాప్ సెప్టెంబరు 22న స్టాక్ ఎక్స్ఛేంజీలకు రూ.11,139 కోట్ల జీఎస్టీ నోటీసు అందిందని తెలియజేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఈ నోటీసును పంపారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలను ప్రకటించలేదు. కానీ సేల్ బ్యానర్ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్‌సైట్‌లో మాత్రం కనిపిస్తుంది.
వచ్చే నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ నెలలో బ్యాంకులకు సుమారు 15 రోజులు సెలవులున్నాయి. అయితే దాదాపు నెలలో సగం రోజులు మాత్రమే బ్యాంకు సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
మహీంద్రా అండ్ మహీంద్రా తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ.5.80 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. సోమవారం సెన్సెక్స్ 242 పాయింట్లు పడిపోయింది. మంగళవారం మార్కెట్ ముగియగా బుధవారం సెన్సెక్స్‌లో 796 పాయింట్ల పతనం కనిపించగా, గురువారం అంటే నేడు సెన్సెక్స్‌లో 663 పాయింట్ల పతనం కనిపించింది. దీంతో ఈ వారం మొత్తం నష్టం 1700 పాయింట్లకు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా వడ్డీ రేట్ల ఒత్తిడి లోనైనట్లు కనిపిస్తుంది. ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందని అంచనాలు వచ్చిన నేపథ్యంలో అనేక కంపెనీలు స్టాక్స్ నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా దిగువకు పయనిస్తున్నాయి.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం ఆల్ రౌండ్ అమ్మకాలు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారీ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ నేల చూపు చూసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయి 66728 కనిష్ట స్థాయికి పడిపోయింది.
5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఫైబర్ పేరిట రిలియన్స్ జియో తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సేవలను హైదరాబాద్ సహా మొత్తం 8 నగరాల్లో ప్రారంభించింది. అతి తక్కువ ధరకే 14 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌తో పాటు ఇంటర్నెట్‌ను అందిస్తుంది.
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని ప్రభుత్వం ఇప్పుడు నవంబర్ 30గా నిర్ణయించింది. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
నామినేషన్ వర్క్ పూర్తి చేయని ఎంఎఫ్ ఇన్వెస్టర్లు దేశంలో చాలా మంది ఉన్నారు. రిజిస్ట్రార్, బదిలీ ఏజెంట్ (RTA) డేటా ప్రకారం.. వారి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టని 25 లక్షల మందికి పైగా పాన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు.
టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో తమ సరికొత్త కర్వ్ కూపే ఎస్ యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ మోడల్ కంపెనీ రాబోయే మీడియం రేంజ్ ఎస్ యూవీని సూచిస్తుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ఎల్‌ఐసీకి చెందిన 13 లక్షల మంది ఏజెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఎల్‌ఐసికి చెందిన 10 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు.
డాలర్‌తో రూపాయి వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్‌లో క్షీణించింది. డాలర్‌కు దాని ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 83.29 (తాత్కాలిక) వద్ద 13 పైసలు పడిపోయింది. దీంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల సెంటిమెంట్ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.