HDFC బ్యాంకు అనుబంధ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOకు సిద్ధమైంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.12,500కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్‌లో రూ.10వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,500కోట్ల నిధుల్ని సమీకరించనుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో HDFC బ్యాంక్‌కు 94.64 శాతం వాటా ఉంది.