»How To Get Rid Of Fear And Earn Money Vishwa Money Babu Money Mantra Hittv Devotional
Money Mantra : ఇలా చేస్తే నువ్వు కోరిన డబ్బు, ఆనందం నీ సొంతం!
నీలో ఉన్నది నువ్వు గుర్తిస్తే అన్నీ సాధించగలవు. పట్టుదల ఉంటే సాధించనిది అంటూ ఏదీ లేదు. మనసును నిశ్చలంగా ఉంచుకున్నప్పుడే నీలో ధైర్యం పెరుగుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అన్నీ సాధించగలవు. అసలు మనసును ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? నువ్వు కోరిన డబ్బు, ఆనందం నీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? నీలో ఉన్నది నువ్వు గుర్తించగలగడానికి ఏం చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
పిరికితనం, భయం ఎవరైతే వదిలేస్తారో వారు అనుకున్నది సాధిస్తారు. పులి పెద్ద గిలి పెద్ద అంటే పులే గొప్పది. కానీ దాని మనసు ఎప్పుడైతే ధైర్యంగా ఉండదో అది గిలిని చూసి భయపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ మనసుతో మాట్లాడాలి. మనసుకు చెప్పుకోవాలి. పట్టుదలతో మనం సాధించాలి అని అనుకోవాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్న పనిని నెరవేర్చుతారు. పట్టుదల ఉంటే మనిషి సాధించనిదంటూ ఏదీ లేదు. డబ్బు సాధించాలంటే కూడా మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. భయాన్ని వదలాలి. ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అప్పుడే అనుకున్నది మీ సొంతం అవుతుంది. అసలు మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఏం చేస్తే మనం అనుకున్నది సాధించగలం? వీటన్నింటికి జవాబు కావాలంటే ఈ వీడియో చూసేయండి.