Gold and Silver Rates Today : బంగారం తగ్గినప్పుడు కొనుక్కుందాం అనుకునే వారు రోజూ దాని ధరను గమనించుకుంటూ ఉండాల్సిందే. అప్పుడే కాస్త రేటు తగ్గినప్పుడు కొనుక్కోవడానికి వీలవుతుంది. శుక్రవారం మళ్లీ పసిడి ధర పెరిగింది. గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న దీని ధర నేడు మళ్లీ రూ.446 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,746కు చేరుకుంది.
చదవండి : నేటి రాశిఫలాలు(2024 June 28th).. ఈ రాశివారు నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) ప్రస్తుతం రూ.73,746గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మళ్లీ మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్న ధర మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనదని వినియోగదారులు గమనించాలి. అలాగే బంగారు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు తోడుగా జీఎస్టీ, మజూరీల్లాంటివీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
చదవండి : కళ్లు చెదిరేలా కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్… ఎంతంటే?
దేశీయ మార్కెట్లో వెండి ధర(Silver Rate) సైతం శుక్రవారం పెరిగింది. రూ.688 పెరిగింది. దీంతో కిలో వెండి ధర నేడు రూ.89,828కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర చోట్లా వెండి రేటు ఇలాగే ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర నేడు 21 డాలర్లు పెరిగి 2321 డాలర్లకు చేరింది. వెండి 29.6 డాలర్లుగా ఉంది.

