Gold and Silver Rates Today : పసిడి, వెండి లోహాలపై పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీటి ధరలు రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ.76,360 ఉండగా మంగళవారానికి రూ.76,448కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.76,448గా కొనసాగుతోంది. ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నది మాత్రమే. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే నగల కొనుగోలు సమయంలో తరుగు, మజూరీ, జీఎస్టీ లాంటివి కూడా అదనంగా తోడవుతాయి.
చదవండి : చెప్పుల వ్యాపారుల ఇంట్లో పరుపులు, మంచాల్లో దాచిన భారీ నోట్ల కట్టలు.. సీజ్
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు ఎగసి పడుతున్నాయి. కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.92,449 ఉండగా, మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.2,471 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.94,920కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి ఉదయం పెరగడం గమనించదగ్గ విషయం.
చదవండి : టాల్కం పౌడర్‌తో ఒవేరియన్ క్యాన్సర్ ప్రమాదం!
ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంది. అక్కడ స్పాట్ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర 2412 డాలర్లుగా ఉండగా ఔన్సు వెండి ధర ధర ప్రస్తుతం 31.41 డాలర్లుగా ఉంది.

