Today Gold Rate In Hyderabad
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ.74,948 ఉండగా, మంగళవారం నాటికి రూ.876 పెరిగి రూ.75,824కు చేరుకుంది.
చదవండి : 45 రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ : కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,824గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : ఆ రూట్లో రూ.349కే విమాన ప్రయాణం
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.86,159 ఉండగా, మంగళవారం నాటికి రూ.372 పెరిగి రూ.86,531కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,359 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 28 డాలర్లు పెరిగి 2,387కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.83 డాలర్లుగా ఉంది.

