Gold Rates Today : భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా బుధవారం మళ్లీ బాగానే తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మంగళవారం రూ.67,857 ఉండగా, బుధవారం నాటికి రూ.502 తగ్గి రూ.67,355కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,355గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) మంగళవారం రూ.74,994 ఉండగా, బుధవారం నాటికి రూ.584 తగ్గి రూ.74,410కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి రూ.500 పైనే తగ్గడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గింది. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2178 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 18 డాలర్లు తగ్గి 2160 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 24.15 డాలర్లుగా ఉంది.