Gold and Silver Rates Today : బంగారం ధర వరుసగా రెండు రోజులుగా పెరుగుతూనే ఉంది. నేడు ఏకంగా రూ.76వేలు దాటింది. ఈ వారం ప్రారంభంలో స్వల్పంగా తగ్గిన దీని ధర ఆ తర్వాత నుంచి వరుసగా పెరుగుతూనే ఉంది. బుధవారం దేశీయ మార్కెట్లో దీని ధర రూ.605 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు ఏకంగా రూ.76,190కి చేరుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధర(Gold Rate) దాదాపుగా ఇలాగే ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లోనూ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.76,190గానే కొనసాగుతోంది. అయితే ఈ ధర మార్కెట్ మొదలయ్యే సమయంలో నమోదైనది. తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. నగల్ని కొనుక్కునే వారు ఈ ధరకు తోడుగా మజూరీ, జీఎస్టీ, రాళ్లు తదితరాలకు సైతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక వెండి ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటున్నాయి. గత వారం రోజులుగా దీని తీరు ఇలాగే ఉంది. దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) బుధవారం సైతం భారీగా పెరిగింది. రూ.1,011 పెరగడంతో కేజీ వెండి నేడు ఏకంగా రూ.95,521 కు చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి చోట్ల సైతం దీని ధరలు ఇలాగే ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 44 డాలర్లు పెరిగి 2472 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 31.11 డాలర్లుగా ఉంది.