»Ceo Of Cred Kunal Shah Revealed His Monthly Salary
Ceo Of Cred Kunal Shah: ఆ కంపెనీ సీఈవో జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఎంతంటే?
ఒక కంపెనీ సీఈవో(CEO) అంటే లక్షలల్లో కోట్లల్లో జీతం ఉంటుంది. ఇటీవలే యాపిల్ సీఈవో(Apple Ceo) సగం జీతం కోత విధించుకున్నారు. దీంతో ఆయన రూ.405 కోట్లు మాత్రమే జీతం తీసుకుంటున్నారు. ఇకపోతే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారి జీతాలు కోట్లల్లోనే ఉంటాయనడంతో సందేహం లేదు. కానీ ఇక్కడొక కంపెనీ సీఈవో(CEO) నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతం(Salary) తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆయనే క్రెడ్ ఫౌండర్ కునాల్ షా(CRED Founder).

ఇన్ స్టాగ్రామ్ వేదికగా ”ఆస్క్ మీ ఎనీ థింట్” అనే కార్యక్రమంలో క్రెడ్ ఫౌండర్ కునాల్ షా(Kunal Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ ఆయన జీతం ఎంతుంటుందని ప్రశ్నించారు. అందుకు కునాల్ షా(Kunal Shah) మాట్లాడుతూ తాను రూ.15 వేల జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సమాధానం విని యూజర్లు షాక్ అవుతున్నారు. అన్ని కోట్ల ఆస్తి ఉండే కంపెనీ సీఈవో(CEO) అంత తక్కువ జీతం తీసుకోవడం చూసి అందరూ అవాక్కవుతున్నారు.
తమ కంపెనీ లాభాల బాట పట్టేంత వరకూ తాను నెలకు రూ.15 వేల జీతం మాత్రమే తీసుకుంటానని కునాల్ షా(Kunal Shah) తెలిపారు. తాను ఫ్రీఛార్జ్ కంపెనీని అమ్మానని, అలా వచ్చిన డబ్బుతోనే జీవిస్తున్నట్లు కునాాల్ షా మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2013లో జుకర్ బర్గ్ కూడా ఏడాదికి కేవలం ఒక డాలర్ జీతం(Salary) తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. అయితే కునాల్ షా(Kunal Shah) మీద పలు విమర్శలు కూడా ఉన్నాయి. కంపెనీ ఖర్చులతో రోజుకు లక్షలు ఖర్చు పెడుతుంటాడని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని, జీతం(Salary) విషయం వచ్చేసరికి నెలకు అంత తక్కువే తీసుకుంటున్నాడని పలు విమర్శలు ఉన్నాయి.