TG: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లమంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతున్నారు.