ఆదాయ పన్ను చెల్లింపునకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత ఆర్థిక సంవత్సరానికిగానూ మరో 15 రోజులు పెంచింది. ఈ నిర్ణయంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఐటీ రిటర్నులు డిసెంబర్ 15 లోపు దాఖలు చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి సెక్షన్ 139(1) కింద ఐటీ రిటర్నుల గడువు తేదీని పెంచినట్లు వెల్లడించింది.