TG: ఈసెట్ ఫలితాలను ఇవాళ మ.3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వెల్లడించారు. పాలిటెక్నిక్ (డిప్లొమా), BSC (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా BTech, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.ecet.tgche.ac.inలో చెక్ చేసుకోవాలని సూచించారు.