భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం రూ.999లతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులు. రోజుకూ 100 ఉచిత SMSలతోపాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. 2GB రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అలాగే, 5G ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రాంతాల్లోనివారు అపరిమిత 5G డేటాను వాడుకోవచ్చు. JIOTV, జియోక్లౌడ్, JIO సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను కూడా వినియోగదారులు పొందవచ్చు.