TG: హైదరాబాద్‌లో గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. చంద్రశేఖర్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అరెస్టు చేసింది. చంద్రశేఖర్ రూ.7 కోట్ల స్కామ్ చేశారని.. ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్‌కు విక్రాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసి ఈవోడబ్య్లూ ఆధారాలు సేకరించింది. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.