GNTR: పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం జీబీసీ రోడ్డు ప్రధాన రహదారిపై శనివారం ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పొన్నూరు వైపు నుంచి వస్తున్న కారు.. గుంటూరు వైపు నుంచి వెళ్తున్న కారు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయని తెలిపారు. ఘటనలో రెండు కార్లు ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.