ఇటీవల అధిక పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి తమిళనాడులో వెలుగుచూసింది. ఉద్యోగంలో పని ఒత్తిడికి మరో ఉద్యోగి బలయ్యాడు. 15 ఏళ్లుగా సాఫ్ట్వేర్ పని చేస్తున్న అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి కరెంట్ షాక్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 2 నెలల నుంచి పని ఒత్తిడికి గురైన అతను.. సంబంధిత వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.