కృష్ణా: విజయవాడ కృష్ణలంకలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కృష్ణలంక సీఐ నాగరాజు వివరాల మేరకు.. ప్రకాశం బ్యారేజ్ సీతమ్మ వారి పాదాల సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడి వయసు సుమారు 35-40 వరకు ఉంటుందని చెప్పారు. ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.