»Wrestlers Meeting Concluded With Anurag Thakur 5 Demands Before The Centre
Wrestlers Protest: అనురాగ్ ఠాకూర్‌తో ముగిసిన రెజ్లర్ల భేటీ..కేంద్రం ముందు 5 డిమాండ్లు
గతంలో కేంద్రానికి, రెజ్లర్లకు మధ్య మొదటి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) తొలి సమావేశంలో రెజ్లర్లతో మాట్లాడారు. అయితే ఆ సమావేశం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరగ్గా ప్రధానంగా ఐదు డిమాండ్లను రెజ్లర్లు వినిపించారు.
గత కొన్ని రోజుల నుంచి రెజ్లర్లు ఆందోళన(Wrestlers Protest) చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్(Brij Bhushan) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ రెజ్లర్లు ఆందోళన చేపడుతున్నారు. ఈ విషయంలో రెజ్లర్లకు కొందరు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు మద్దతు తెలిపారు. తాజాగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Takur) కూడా రెజ్లర్లతో సమావేశం అయ్యారు.
రెజ్లర్లు భజరంగ్ పూనియా(Bhajarang Punia), సాక్షి మాలిక్(sakshi Malik)లతో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రెజ్లర్లు(Wrestlers) ప్రధానంగా ఐదు డిమాండ్ల(Demands)ను ఉంచారు. గతంలో కేంద్రానికి, రెజ్లర్లకు మధ్య మొదటి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) తొలి సమావేశంలో రెజ్లర్లతో మాట్లాడారు. అయితే ఆ సమావేశం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరగ్గా ప్రధానంగా ఐదు డిమాండ్లను రెజ్లర్లు వినిపించారు.
రెజ్లర్ల ఐదు డిమాండ్లు ఇవే: ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని రెజ్లర్లు కోరారు. ఫెడరేషన్ చీఫ్‌గా మహిళను నియమించాలని డిమాండ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్లో బ్రిజ్ భూషణ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ఉండకూడదని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున తమపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని రెజ్లర్లు కోరారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.