రైతుల(Formers)కు కేంద్ర ప్రభుత్వం(Central Government) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్, వర్షాకాల పంటలకు కనీస మద్దతు ధర(MSP)ను భారీగా పెంచింది. బుధవారం దీనికి సంబంధించిన ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంటల సాగును ప్రోత్సహించడానికి, సాగుదారులకు మేలు కలిగేలా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCEA) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ధరల పతనానికి వ్యతిరేకంగా రైతుల(Formers)కు ఆర్థిక భద్రతను కల్పించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్పీ(MSP) అనేది రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసే కనీస ధరను తెలియజేస్తుంది. ఇది నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తుల(Agricultural Items)కు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర మాత్రమే. దీనిపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్(Cabinet) తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Minister Piyush Goel) మీడియాకు తెలియజేశారు.
క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143కు పెంచడంతో ఇప్పుడు వరి క్వింటాల్ ధర రూ.2,183కు చేరుకుంది. గ్రేడ్ ఏ వరికి రూ.163లు పెంచడంతో రూ.2,203కు మద్దతు ధర చేరుకుంది. ఇకపోతే పెసరకు కూడా ఈసారి 10.4 శాతం మద్దతు ధర పెంచారు. దీంతో క్వింటాల్ పెసర ధర రూ.8,558కి చేరుకుంది.
హైబ్రిడ్ జొన్న చూస్తే క్వింటాల్ రూ.3,180, జొన్న రూ.3,225లు, రాగి రూ.3,846లు, సజ్జలు రూ.2500లు, మొక్కజొన్న రూ.2,090లు, పొద్దుతిరుగుడు రూ.6,760లు, వేరుశనగ రూ.6,377లు, సోయాబీన్స్ రూ.4,600లు, పత్తి మధ్య స్థాయి పింజ రూ.6,620లు, పత్తి పొడవు పింజ రూ.7,020ల చొప్పున కనీస ధరను కేంద్రం నిర్ణయించింది.