ప్రజలను కట్టిపడేసేవి రెండే రెండు. ఒకటి ఆటా, రెండోది పాటా. ఈ రెండు ఆయా వ్యక్తులకు పాటపాడటం, డ్యాన్స్ చేయడం రాకపోయినా సరే పాటను వినడానికి, డ్యాన్సును చూడడానికి ఇష్టపడతారు. ఇంటర్ నెట్ లేని కాలంలో ఎవరి ప్రతిభా అంతగా భయటకు వచ్చేది కాదు. ఏంతో మంది తమ ట్యాలెంట్ ను అలాగే ఉంచేసుకుని మనకెవడు అవకాశం ఇస్తాడులే అని జీవితాన్ని ముగించేవాళ్లు. కానీ కాలం మారింది. అరచేతిలో ప్రపంచం ఇమిడి పోయింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ భాషైనా సరే తమ ట్యాలెంటును కోట్లమందికి చేర్చవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని వ్యక్తులందరూ తమ ట్యాంలెంట్ ను ఆన్ లైన్ లో ప్రదర్శించి గుర్తింపు పొందుతున్నారు.
అందులో భాగంగానే వివిధ రకాలైన వ్యక్తుల ప్రతిభను గుర్తించగలుగుతున్నాం. అంతే కాకుండా మన ట్యాటెంట్ ను ప్రపంచం ముందు ఉంచగలుగుతున్నాం. అందుకు మనం సోషల్ మీడియాకు రుణపడి ఉన్నాం. తాజాగా.. ఓ డ్యాన్స్ క్లిప్ వైరల్ అయింది. ప్లేయర్ x సే ఇన్ రైట్ (Players x Say it right) అనే మ్యాషన్ కు చీర కట్టుకుని ఓ మహిళ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. డ్యాన్స్ చేసిన మహిళ ఎవరో కాదు.. మీరందరూ హీరో కమల్ హసన్ తాజా చిత్రమ్ విక్రమ్ చూసే ఉంటారు. అందులో టీనా రిపోర్టింగ్ సర్ అంటూ అండర్ కవర్ లో పని చేసి కత్తిలాంటి ఫైట్ చేసి మహిళ మీకు గుర్తుండే ఉంటుంది. ఆఆ…ఆవిడే ఈవిడ. ఇన్ స్టాగ్రామ్ లో @agent_tina_official అనే ఎకౌంట్ లో వీడియోను పోస్ట్ చేసింది టీనా. అందులో ఆవిడ నారింజ కలర్ చీరను కట్టుకుని కళ్లకు అద్దాలు పెట్టుకుని చిందర వందరగా డ్యాన్స్ చేస్తూ ఇరగదీసింది. ఈ వీడియో రిలీజ్ అయిన నుంచి…ఇప్పటికి దాదాపు 75వేల సార్లు ప్రమోట్ చేశారు నెటిజన్లు.