అవార్డులలో బలగం సినిమా (awards for balagam cinema) హవా కొనసాగుతోంది. మంచి కథ, కథనంతో మెప్పించిన వేణు యెల్దండిని (venu yeldandi) అందరూ ప్రశంసిస్తున్నారు. దశాబ్దాల క్రితం గ్రామాల్లో ప్రొజెక్టర్ల ద్వారా సినిమాలు చూపించి, డబ్బులు తీసుకునే వారు. ఒక విధంగా చెప్పాలంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారిలో చాలామందికి గ్రామాల్లో ప్రొజెక్టర్ల ద్వారా సినిమాలు వేసిన విషయం తెలియదు. లవకుశ వంటి (lava kusha) సినిమా కోసం ప్రేక్షకులు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి. దీంతో చాలామంది ఓటీటీలోను సినిమాలు చూస్తున్నారు. ఓటీటీని ఉపయోగించి గ్రామాల్లో ఇప్పుడు బలగం సినిమాను (balagam cinema) ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా గ్రామీణ ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాకు ప్రజల బ్రహ్మరథమే అతిపెద్ద అవార్డు. అయితే ఈ సినిమాకు గాను ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కాయి. తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లోను బలగం హవా కొనసాగుతోంది.
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు (international award for balagam) అందుకున్న ఈ సినిమా తాజాగా అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ -ఆమ్స్టర్డామ్ కార్యక్రమంలో మరో అవార్డును సొంతం చేసుకున్నది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు యెల్దండి (venu yeldandi) దీనిని అందుకున్నారు. యూకే, అమెరికా, చైనా దేశాలకు చెందిన దిగ్గజ దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివెల్, ఒనికో ఫిల్మ్ అవార్డు తదితర అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నది. తాజా అవార్డుతో బలగంకు ఇప్పటి వరకు తొమ్మిది అవార్డులు వచ్చాయి.
కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ కథను నడిపించారు బలగం సినిమాలో. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నడించారు. దిల్ రాజు ప్రొడక్షన్ పైన దిల్ రాజు కూతురు, అల్లుడు హన్షిత, హర్షిత్ దీనిని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.