»Up Bride Chases Runaway Groom Over 20 Km Brings Him Back To Wedding Mandap
Bride chases: పెళ్లి నచ్చక పారిపోయిన వరుడు..వధువు చేసిన పనికి ప్రశంసలు
పెళ్లి రోజున ఓ వరుడు వివాహం చేసుకోవడం ఇష్టంలేక పారిపోయాడు. దీంతో అమ్మాయి ఊరికే ఊరుకోలేదు. అతని కోసం ఏకంగా 20 కి.మీ వెంబడించి అతన్ని పట్టుకుని తిరిగి మండపానికి తీసుకువచ్చింది. తర్వాత అతన్నే మ్యారేజ్ చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్(viral) అవుతుంది.
వారిద్దరికీ పెళ్లి(marriage) కుదిరింది. పెద్దలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా పెళ్లి రోజున వరుడు పారిపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నచ్చక మండపం నుంచి వరుడు పారిపోయాడు. అయితే వరుడు(groom)పారిపోవడంతో పెళ్లి ఆగిపోయిందని వధువు(bride) ఏడుస్తూ కూర్చోలేదు. అతనిని వెంటపడి మరి పట్టుకుని సాధించింది. చివరకు అతనినే పెళ్లాడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా..ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ(woman) రెండేళ్ల నుంచి సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో వారికి పెళ్లి చేయడానికి ఓ మంచి ముహూర్తం నిర్ణయించారు. మే 21న భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వివాహానికి ముహూర్తం ఖరారయ్యింది. పెళ్లి రోజు రానే వచ్చింది.
పెళ్లి కుమార్తె పెళ్లి పీటలపై కూర్చుని ఉంది. గంటలు గడుస్తున్నా.. పెళ్లికొడుకు(groom) మండపానికి రాలేదు. పెళ్లికూతురు అతనికి ఫోన్ చేసింది. తాను తన తల్లిని తీసుకురావడానికి బుదౌన్ కు వెళ్తున్నట్లు అతడు చెప్పాడు. పెళ్లి కూతురు అనుమానంతో అతనిని వెంబడించి బరేలీకి 20కి.మీ దూరంలో అతనిని పట్టుకుంది.
ఆ తర్వాత ఇద్దరి కుటుంబ సభ్యులు భీమోర ఆలయంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి కథ నెట్టింట వైరల్(viral)గా మారింది. పెళ్లి కూతురు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. వరుడికి చివాట్లు కూడా పెడుతున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందు చెప్పాలి. కానీ చివరి నిమిషంలో ఇలా చేస్తారా? వధువు చాలా చక్కగా చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.