భారీ వర్షాలు హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి.గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుతోంది. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు కూడా వస్తున్నాయి. అల్వాల్ (Alwal) పరిధిలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. జీహెచ్ఎంసీ అధికారులకు సంపత్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. అయితే కంప్లెంట్ చేసి 6 గంటలు గడిచినా కూడా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది పట్టించుకోలేదు. అంతే ఆ యువకుడికి బీభత్సమైన కోపం వచ్చింది. పామును జీహెచ్ఎంసీ ఆఫీసుకి తెచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌పై పాము (Snake) ను పెట్టి సంపత్ తన నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.