»Telangana New Secretariat Gets Indian Green Building Council Award
Green Building Award ప్రారంభించిన తొలి రోజే సచివాలయానికి అవార్డు
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయం నిర్మించాం. ఈ ఘనత ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం (Dr B R Ambedkar Telangana Secretariat) యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. సుందరమైన శ్వేత సౌధం (White House) చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమైన ఈ పరిపాలన సౌధం (Office Building) దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆదివారం ప్రారంభించుకున్న ఈ సచివాలయం తొలి రోజే అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. ఈ భవన సముదాయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ (Green Building Council Award) లభించింది. ఈ అవార్డు రావడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అవార్డును తెలంగాణ రోడ్ల, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) స్వీకరించారు.
భారతదేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డు మన సచివాలయం రికార్డు సాధించింది. కొత్త సచివాలయంలో సోమవారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (Indian Green Building Council) సభ్యులు మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి అవార్డును అందించారు. అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయం నిర్మించాం. ఈ ఘనత ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. త్వరలో సచివాలయంలో సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి తెలిపారు. త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా సచివాలయం సొంతం చేసుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్
డా.BR అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డు pic.twitter.com/R3H2tD0ndP