»Telangana Is Second In The India In Livestock First Position Of Sheeps Number
Livestock: పశుసంపదలో తెలంగాణ దేశంలో రెండో స్థానం..గొర్రెల సంఖ్యలో ఫస్ట్
తెలంగాణ(Telangana) పశుసంపద(livestock)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్(west bengal) మొదటి స్థానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 19.1 మిలియన్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తెలంగాణ(Telangana) రాష్ట్రం పశుసంపద(livestock)లో సరికొత్త ఘనతను సాధించింది. భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పశుసంపద పెరుగుదలలో తెలంగాణ పశ్చిమ బెంగాల్(west bengal) తర్వాత రెండో స్థానంలో ఉంది. మరోవైపు తెలంగాణ 19.1 మిలియన్ల గొర్రెల(sheeps) సంఖ్యతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు 1,667 కోట్ల గుడ్ల ఉత్పత్తితో మూడో స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలోనూ రాష్ట్రం ఉంది. 2021-22లో 58.07 లక్షల టన్నుల పాల ఉత్పత్తి, 10.04 లక్షల టన్నులతో 13వ స్థానం, పశుసంవర్ధక రంగంలో సుమారు 75 శాతం GVAని తెలంగాణ కల్గి ఉంది.
తెలంగాణ గ్రామీణ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజల(people)కు జీవనోపాధి కల్పించడంలో పశుసంవర్ధక రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పశుసంపదను(livestock) మెరుగుపరిచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. వాటి ఫలితంగా పశుసంపద మూడు రెట్లు(three times) పెరిగిందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పశుసంపదను మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషి ద్వారా వృద్ది జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే గత తొమ్మిదేళ్లలో పశుసంవర్ధక రంగానికి చెందిన జీవీఏ 2014-15లో రూ.29,282 కోట్ల నుంచి 2022-23 నాటికి రూ.1,03,895 కోట్లకు పెరిగింది. అంతేకాదు 2012 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో పశువుల జనాభా 26.7 మిలియన్ల నుంచి 32.6 మిలియన్లకు పెరిగింది. ఈ క్రమంలో 22 శాతం వృద్ది నమోదైనట్లు రిపోర్టు వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం(Telangana government) ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 25.82 లక్షల కుటుంబాలు పశువుల పెంపకం లేదా సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి. వ్యవసాయ రంగం వృద్ధికి ఫైనాన్స్ యాక్సెస్ కీలకం. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌తో, రైతులకు సులభంగా, త్వరితగతిన నిధులను పొందేందుకు ప్రమాదరహిత వాతావరణాన్ని సృష్టించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను అందిస్తోంది.